కాకినాడ తీరం లోని 'స్టెల్లా' నౌకకు పచ్చజండా...! 1 d ago
ఏపీ: కాకినాడ తీరంలో గత 55 రోజులుగా నిలిచిపోయిన 'స్టెల్లా ఎల్' నౌకకు ఎట్టకేలకు పచ్చజెండా ఊపుతున్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదివారం మీడియాకు తెలిపారు. ఈ నౌక విషయం అందరికి తెలిసిందే. నవంబర్ 11న కాకినాడకు రాగ, దానిలో 32,415 టన్నుల లోడయ్యాక, నవంబర్ 27న అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసాక, ఆ బియ్యంలో 36శాతం ఫోర్టీఫైడ్ కార్నల్స్ ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులు 6ఏ కేసు నమోదు చేసి 1,320 టన్నుల రేషన్ బియ్యంని, డిసెంబర్ 30న స్వాధీనం చేసుకొని సీజ్ చేసారు. ఎగుమతిదారుల అభ్యర్ధనతో మిగిలిన బియ్యాన్ని నౌకలోకి లోడింగ్ చేసి, నౌక నిలిపినందుకు చెల్లించాల్సిన చార్జీలు, ఎక్కించినందుకు కట్టాల్సిన చార్జీలను స్టీమర్ ఏజెంట్ పోర్టు అథారిటీకి చెల్లించి నోడ్యూస్ ధ్రువీకరణ, కస్టమ్స్ అధికారులు ఇచ్చిన క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందాక, సోమవారం తెల్లవారుజామున ఆఫ్రికా తీరంలోకి వెళ్ళింది.